ఆకివీడులో విప్లవ దినోత్సవం

ఆకివీడులో విప్లవ దినోత్సవం

W.G: శ్రామిక వర్గ పోరాటాల ద్వారానే పీడిత ప్రజలకు విముక్తి లభిస్తుందని సీపీఎం జిల్లా సీనియర్ నాయకులు బొక్క సత్యనారాయణ అన్నారు. విప్లవ దినోత్సవం సందర్భంగా ఆకివీడులో ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించారు. ప్రభుత్వ రంగ సంస్థలను రక్షించుకోవడానికి కార్మిక వర్గం సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తవిటి నాయుడు, పెంకి అప్పారావు, రవితేజ పాల్గొన్నారు.