'చంద్రబాబు సర్కారుపై పోరాటానికి సిద్ధం'
W.G: చంద్రబాబు సర్కారు అరాచక పాలనపై జగన్ నేతృత్వంలో ప్రజల పక్షాన పోరాటాలు, ఉద్యమాలు చేసేందుకు యువజన విభాగం సిద్ధంగా ఉందని జక్కంపూడి రాజా అన్నారు. మంగళవారం తణుకులో ఉమ్మడి గోదావరి జిల్లాల యువజన విభాగం సమావేశం నిర్వహించారు. పోరాటాల దిశగా భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో కారుమూరి సునీల్ తదితరులు పాల్గొన్నారు.