జాబిల్లి చెంతకు ఆర్టెమిస్ 2
నలుగురు వ్యోమగాములతో నాసా ప్రయోగించిన ఆర్టెమిస్-2 యాత్ర చంద్రుడి గురుత్వాకర్షణ పరిధిలోకి ప్రవేశించింది. వీరిని తీసుకెళ్లిన ఒరామన్ వ్యోమనౌక 4,06,773 కి.మీ దూరం ప్రయాణించి అత్యంత సుదూర మానవ అంతరిక్ష యాత్రగా చరిత్రకెక్కింది. 1970లో అపోలో 13 ప్రయాణించిన దూరం కంటే ఇది 2,500 కి.మీ అదనం కావటం విశేషం. ఈ నౌక నుంచి చంద్రుడి రెండో పార్శ్వాన్ని వ్యోమగాములు ఫొటో తీశారు.