నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

AKP: నక్కపల్లి మండలంలో పలు గ్రామాలకు మంగళవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఈఈ రాజశేఖర్ తెలిపారు. కొత్త విద్యుత్ లైన్ ఏర్పాటు చేస్తున్న కారణంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉపమాక, పెదతీనార్ల, చినతీనార్ల, దొండపాక, సిహెచ్ఎల్ పురం,జానకయ్యపేట, కాగిత, చందనాడ బుచ్చిరాజుపేట గ్రామాలకు విద్యుత్ సరఫరాలు నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు.