నూతన ఛానల్ రూపకల్పనకు DPR సిద్ధం చేయండి

NTR: బుడమేరు డైవర్షన్ ఛానల్ పెండింగ్ పనులు వెంటనే ప్రారంభించాలని మంత్రి నిమ్మల రామనాయుడు అధికారులకు ఆదేశాలిచ్చారు. బుధవారం ఈ అంశంపై సంబంధిత అధికారులతో ఆయన తన సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. 37 వేలకు పైగా క్యూసెక్కుల నీటి ప్రవాహం తట్టుకునేలా ఛానల్ అభివృద్ధి చేయాలని, బుడమేరు ప్రవాహం ఎనికేపాడు, కొల్లేరు, ఉప్పుటేరు ద్వారా సముద్రంలో కలిసేలా ఛానల్ రూపొందించాలని అధికారులకు ఆదేశించారు.