VIDEO: కేకే లైన్‌లో విరిగిపడ్డ కొండచరియలు
అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోని కొత్తవలస-కిరండూల్ (కేకే) రైలు మార్గంలో ఆదివారం కొండచరియలు విరిగిపడటంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. భారీ వర్షాల కారణంగా ఈ ఘటన చోటుచేసుకుంది. కేకే లైన్‌పై కొండచరియలు, బండరాళ్లు భారీగా జారిపడ్డాయి. దీని కారణంగా రైల్వే పట్టాలు, ఓహెచ్‌సీ కేబుల్ దెబ్బతిన్నాయి.