పరీక్ష కేంద్రాన్నికలెక్టర్ ఆకస్మిక తనిఖీ
KMR: మద్నూర్ మండలంలోని ZPHSలో పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్ధుల హాజరు శాతం, సౌకర్యాలపై DEO రాజును వివరాలు అడిగి తెలుసుకొన్నారు. పరీక్షా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్‌ను పరిశీలించారు. విద్యార్ధుల ఆరోగ్య, భద్రత దృష్ట్యా వైద్య సిబ్బందితో పాటు అవసరమైన మెడిసిన్‌ను అందుబాటులో ఉంచాలని సూచించారు.