మంత్రిని కలిసిన టీడీపీ అధ్యక్షులు

మంత్రిని కలిసిన టీడీపీ అధ్యక్షులు

VZM: రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్‌ను జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కిమిడి నాగార్జున మంగళవారం అమరావతిలో కలిశారు. ఇటీవల తనను  ఉమ్మడి విజయనగరం జిల్లా డిసిసిబి అధ్యక్షునిగా ఎంపిక చేసినందుకు లోకేష్‌కు నాగార్జున కృతజ్ఞత తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలియజేశారు.