VIDEO: ఎమ్మెల్యే యశస్వినీపై ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేత

JNG: కాంగ్రెస్ అసమ్మతి నేత పెద్ది కృష్ణమూర్తి పాలకుర్తి MLA యశస్వినీ రెడ్డి, TPCC ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డిలపై తీవ్ర ఆరోపణలు చేశారు. సోమవారం దేవరుప్పుల మండలంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నికార్సయిన కార్యకర్తలను పక్కనపెట్టి, వలస కాంగ్రెస్ వాదులకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా అవినీతికి తెరలేపుతున్నారని ఆరోపించారు. కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు.