ఎలుగుబంటి సంచారం – తృటిలో తప్పిన ప్రమాదం
MHBD: కొత్తగూడ మండలం బోత్తవానిగూడెం గ్రామ సమీపంలో ఎలుగుబంటి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. శుక్రవారం తాళ్లబోడు ప్రాంతానికి మలవిసర్జన కోసం వెళ్లిన కల్తీ నారాయణపై ఎలుగుబంటి ఒక్కసారిగా దాడికి యత్నించింది. ఆయన వెంట ఉన్న కుక్కలు అరవడంతో అది వెనక్కి తగ్గి పొదల్లోకి పారిపోయింది. ఈ ఘటనలో అతడికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో ప్రాణాపాయం తృటిలో తప్పింది.