పిస్తా హౌస్ ఓనర్ మజీద్ ఇంట్లో దాడులు
HYDలో ఐటీ శాఖ పిస్తా హౌస్, షాగౌస్, మెహిఫిల్ హోటళ్ల యజమానుల ఇళ్లలో ఉదయమే తనిఖీలు మొదలు పెట్టింది. ఈ తనిఖీలో పలు రికార్డులను పరిశీలించింది. రికార్డుల్లో చూపిన ఆదాయం, నిజమైన ఆదాయానికి వ్యత్యాసాన్ని గుర్తించారు. రాజేంద్రనగర్ పిస్తా హౌస్ ఓనర్ మజీద్ ఇల్లు వద్ద అధికారులు 4 బృందాలతో తనిఖీలు చేస్తున్నారు. హవాలా ట్రాన్సాక్షన్లు, నకిలీ లావాదేవీలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.