'దొడ్డి కొమురయ్యను ఆదర్శంగా తీసుకోవాలి'
BHPL: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్యను ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి కలెక్టరేట్‌లో దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే నివాళులర్పించారు. నిజాం నిరంకుశ పాలనకు ఎదురొడ్డి పోరాడిన తొలి అమరవీరుడు దొడ్డి కొమురయ్య అని గండ్ర తెలిపారు.