సికిల్ సెల్ ఎనీమియా వ్యాధిపై అవగాహన కార్యక్రమం

కోనసీమ: సికిల్ సెల్ ఎనీమియా వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఆలమూరు మండలం పెదపల్ల PHC వైద్యాధికారి సాయి కిషోర్ అన్నారు. శుక్రవారం ఈ వ్యాధిపై ఏఎన్ఎం ఆశా వర్కర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి నిర్మూలన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఎంపీడీవో రాజు తెలిపారు.