వీరవాసరంలో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ

W.G: వీరవాసరం మండల కేంద్రంలో స్థానిక బీజేపీ నాయకులు వేండ్ర దివాకర్ ఆధ్వర్యంలో మంగళవారం హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండా, దేశ సమైక్యతను పెంపొందించేలా ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను తమ ఇళ్ళపై ఎగురవేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులతో పాటు లిటిల్ బడ్స్ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.