'ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు నిర్వహించాలి'

SRCL: ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలను నిర్వహించడానికి సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. గురువారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ టెంపుల్ గెస్ట్ హౌస్ సమావేశం మందిరంలో వినాయక చవితి సందర్భంగా గణేష్ ఉత్సవాల నిర్వహణ, నిమర్జన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా , ఎస్పీ మహేష్ బీ గితేలతో సమావేశమయ్యారు.