వృద్ధాశ్రమంలో ఉచిత వైద్య శిబిరం
JGL: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో తారకరామనగర్ వృద్ధాశ్రమంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వృద్ధులకు బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందజేశారు. ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షుడు డా.హేమంత్, కార్యదర్శి డా.శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారి డా. సుధీర్ పాల్గొన్నారు.