రహదారులన్నీ జలమయం

రహదారులన్నీ జలమయం

కృష్ణా: బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్‌లో కురిసిన వర్షానికి గ్రామంలోని రహదారులన్నీ జలమయంగా మారాయి. ముఖ్యంగా విజయవాడ, ఏలూరు, గుడివాడ, నూజివీడు పట్టణాలకు వెళ్లే మార్గాలకు ప్రధాన కూడలి కావడంతో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్య కాలంలోనే డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని గ్రామస్తులు వాపోతున్నారు.