విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలి: కలెక్టర్

విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలి: కలెక్టర్

SDPT: విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం వర్గల్లోని మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించి, భోజన వసతులను పరిశీలించారు. ప్రభుత్వం నిర్ణయించిన కామన్ డైట్ మెనూ ప్రకారం సరుకులు పంపిణీ చేయాలని, విద్యార్థులకు సరిపడా భోజనం వడ్డించాలని ఆమె సూచించారు.