నేడు జిల్లాకు రానున్న ఇంఛార్జ్ మంత్రి
ADB: ఈనెల 2వ తేదీన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లాకు రానున్నారు. ఈనెల 4న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించేందుకే మంత్రి రానున్నట్లు డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్ తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ విషయాన్ని గమనించాలని ఆయన సూచించారు.