తన కారు డ్రైవర్ కొడుకుకి విజయ్ ఎమ్మెల్యే టికెట్
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ టీవీకే అధినేత విజయ్ తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులను ప్రకటించే వేదికపై తన వ్యక్తిగత కారు డ్రైవర్ రాజేంద్రన్ కుమారుడు శబరినాథన్‌కు విరుగంపాక్కం MLA టికెట్‌ను ప్రకటించారు. దీంతో కారు డ్రైవర్‌తో పాటు శబరినాథన్ కన్నీళ్లు పెట్టుకోగా వారిని విజయ్ సముదాయించారు. ఇందుకు సంబంధించిన వీడియో SMలో వైరల్ అవుతోంది.