జనసేన పార్టీలో చేరిన వైసీపీ సర్పంచ్
SKLM: మెలియా పుట్టి మండలం వసుంధర పంచాయతీ సర్పంచ్ సలాన అప్పలనాయుడు గురువారం జనసేన పార్టీలో చేరారు. సుడా ఛైర్మన్ కె. రవికుమార్ ఆయనకు జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు, పార్టీ అధ్యక్షుడు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిపాలనా దక్షత నచ్చి , జనసేనలో చేరినట్లు అప్పలనాయుడు తెలిపారు.