పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు
NTR: మైలవరంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని కోరుతూ ఆంజనేయస్వామి గుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. మైలవరం నియోజకవర్గ అధ్యక్షుడు లంక లితీష్ ఆధ్వర్యంలో 101 కొబ్బరికాయలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, రాష్ట్ర ప్రజలకు మరింత సేవలు అందించాలని భక్తులు ప్రార్థించారు.