హవేలి ఘనాపూర్ ఎస్సైగా నరేశ్

MDK: హవేలి ఘనాపూర్ ఎస్సైగా నరేశ్ శనివారం బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ పనిచేసిన సత్యనారాయణ వీఆర్‌కు బదిలీ కాగా ఆయన స్థానంలో నరేశ్ ఎస్సైగా బాధ్యతలు స్వికరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల సమస్యలు పరిష్కరించి న్యాయం చేస్తామన్నారు. శాంతి భద్రతల కోసం ప్రజలు సహకరించాలని కోరారు. మద్యం తాగి వాహనాలు నడపొద్దని అన్నారు.