ధాన్యం కొనుగోలు సమస్యలను పరిష్కరించాలని వినతి

KKD: రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె. శ్రీనివాస్, ధాన్యం కొనుగోలు సమస్యలను పరిష్కరించాలని కోరారు. శుక్రవారం సాయంత్రం కాకినాడకు విచ్చేసిన రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్‌కు కాకినాడ కలెక్టరేట్‌లో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కౌలు రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు.