'ప్రీ ప్రైమరీ పాఠశాలను సద్వినియోగం చేసుకోవాలి'
PDPL: ధర్మారం మండలంలో ఒకే ఒక ప్రీ ప్రైమరీ పాఠశాల చింతలపల్లిలో ఉందని, దానిని సద్వినియోగం చేసుకోవాలని AMO షేక్ సూచించారు. ఇవాళ ఆయన MEO ప్రభాకర్‌తో కలిసి ప్రైమరీ స్కూల్ వార్షికోత్సవం & ప్రీ ప్రైమరీ స్కూల్ గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో వేడుక జరపడం అభినందనీయం అని పేర్కొన్నారు.