'ప్రజలందరూ మతసామరస్యంను పాటించాలి'
VZM: ఉగాది, రంజాన్ పండగలు మన సాంప్రదాయాలకు ప్రతీకలు అని ఎస్పీ దామోదర్ అన్నారు. జిల్లాలో ఎటువంటి మత ఘర్షణలు తలెత్తకుండా మసీదులు, దేవాలయాల మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని అధికారులకి సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందని, ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.