VIDEO: ఎన్నికల హామీ నెరవేర్చిన సర్పంచ్
PDPL: ముత్తారం మండలంలోని శాత్రాజుపల్లిలో గిరిజనుల తాగునీటి సమస్యను సర్పంచ్ చొప్పరి సంపత్ పరిష్కరించారు. ఎన్నికల హామీ ప్రకారం కొత్త బోరు వేయించి, మోటార్ ఏర్పాటు చేసి నీటిని విడుదలను ప్రారంభించారు. ఏళ్ల తరబడి నీటి కోసం ఇబ్బంది పడుతున్న తమ సమస్యకు పరిష్కారం చూపడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ముంజం అంజయ్య, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.