తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌కు సోనియా సందేశం
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ సందేశం పంపారు. 'ఈ నెల 8, 9న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్న CM రేవంత్ రెడ్డికి అభినందనలు. 2034 నాటికి తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే దిశలో సమ్మిట్ కీలక భూమిక పోషిస్తుంది. రాష్ట్రాభివృద్ధికి రేవంత్ చేస్తున్న కృషి విజయవంతం కావాలి' అని రాసుకొచ్చారు.