కేంద్ర పథకాలపై దృష్టి పెట్టాలి: చంద్రబాబు
AP: కేంద్ర పథకాలు రాష్ట్రంలో అమలయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలని, వారి ఆకాంక్షల మేరకు పథకాల్లో మార్పులు, చేర్పులు జరగాలని సూచించారు. YCP హయాంలో నిధులు పక్కదారిపట్టాయని, ఆ విధానాలతో ప్రజలు ఇబ్బందులపాలయ్యారని పేర్కొన్నారు. సుపరిపాలన కోసం అవసరమైతే బిజినెస్ రూల్స్ మార్చుకోవచ్చన్నారు.