VIDEO: డేంజర్ రోడ్డు.. ఆదమరిస్తే నేరుగా బావిలోకే..!
SDPT: సిద్ధిపేట రూరల్ మండలం తోర్నాల నుండి ఇర్కోడ్‌కి వెళ్ళే హైవే పక్కన సరైన సేఫ్టీ ఏర్పాట్లు లేకపోవడం వల్ల ఆ ప్రాంతం ప్రమాదకరంగా మారింది. రోడ్డు పక్కన లోతైన వంతెన ఉండగా, కొద్ది దూరంలో పెద్ద మోటు బావి ఉంది. అక్కడ ఎటువంటి రక్షణ వ్యవస్థలు లేనందున ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులు జాగ్రత్త తీసుకోకపోతే నేరుగా బావిలో పడిపోవడం ఖాయమని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.