సత్యవేడును డివిజన్ చేయాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి

సత్యవేడును డివిజన్ చేయాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి

TPT: సత్యవేడు కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్ వెంకటేశ్వర్లుకు వినతిపత్రం సమర్పించారు. శ్రీసిటీతో పాటు అనేక కంపెనీలు ఉన్న సత్యవేడు ప్రాంతానికి ఆర్డీవో, డీఎస్పీ కార్యాలయాలు అవసరమని వివరించారు. ప్రభుత్వానికి సిఫార్సు చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.