వినుకొండలో ఉచిత మెగా కంటి, డయాబెటిస్ వైద్య శిబిరం

PLD: వినుకొండ న్యాయవాద సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత మెగా కంటి వైద్య శిబిరం, డయాబెటిస్ ఆరోగ్య పరీక్షా కేంద్రాన్ని జూనియర్ సివిల్ జడ్జి ఎం. మహతి ప్రారంభించారు. శిబిరంలో కంటి పరీక్షలు, రాయితీపై కళ్ళజోళ్ళు, మందులు అందించారు. అలాగే ఉచిత రక్త పరీక్షలు నిర్వహించారు. న్యాయవాదులు, సిబ్బంది, పోలీసులు, కక్షిదారులందరికీ ఈ శిబిరం పరీక్షలు చేశారు.