31 మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు
SRCL: కుటుంబ నియంత్రణ వారోత్సవాలలో భాగంగా వేములవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 31 మంది పురుషులకు కోత, కుట్టు లేని కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశామని ఆసుపత్రి సూపరింటెండెంట్ పెంచలయ్య తెలిపారు. వేములవాడ, బోయినపల్లి, ఎల్లారెడ్డిపేట, మండలాలకు చెందిన ప్రజలు ఈ ఆపరేషన్‌లు చేయించుకున్నారని స్పష్టం చేశారు.