'బాధిత కుటుంబానికి న్యాయం చేయండి'

ASF: పెంచికల్‌పేట మండలంలోని అగర్గూడా గ్రామానికి చెందిన తుమ్మడి రాజశేఖర్ తన దుకాణ యాజమాని అయిన రాచకొండ కృష్ణ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకొని జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా చైర్మన్ రాథోడ్ రమేష్ కమిటీ సభ్యులతో కలిసి పెంచికల్‌పేట చేరుకున్నారు. బాధిత కుటుంబానికి నష్టపరిహారం అందించేలా చూడాలని నిందితుడిని చట్టపరంగా శిక్షించాలన్నారు.