రెండో విడతలో 229 గ్రామపంచాయతీల్లో ఎన్నికలు

రెండో విడతలో 229 గ్రామపంచాయతీల్లో ఎన్నికలు

SRD: రెండో విడత పది మండలాల్లోని 229 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయని కలెక్టర్ ప్రావీణ్య శుక్రవారం ప్రకటనలో తెలిపారు. మొత్తం 649 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని చెప్పారు. 1,941 స్థానాలకు 4,526 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారని పేర్కొన్నారు. ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం 1 వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు.