ఓట్ల చోరీలో బీజేపీ నేతలు ఆరితేరారు: సీఎం
తప్పుడు ప్రచారం, ఓట్ల చోరీలో BJP నేతలు ఆరితేరారని CM సిద్ధరామయ్య మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించేందుకు కాంగ్రెస్ సుదీర్ఘంగా పోరాటాలు చేస్తుందని చెప్పారు. ఓట్ల చోరీతోనే కర్ణాటకలో BJP ఎక్కువ MP స్థానాలను గెలిచిందని, ఇలాగే అనేక రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలని చూస్తోందని ధ్వజమెత్తారు. ఓట్ల చోరీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందన్నారు.