ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన సదస్సు

E.G: గోకవరం మండలం కామరాజుపేటలో ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించారు. ఎండీఎల్ సిబ్బంది బసవన్న గౌడ్, లక్ష్మి మాట్లాడుతూ.. ఆరుతడి పంటలను ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తే అధిక దిగుబడులు, లాభాలు పొందవచ్చని వివరించారు. రైతులు భూమిలో నీటి పరిమాణం కొలిచేందుకు ఉపయోగపడే ప్లాస్టిక్ గొట్టాలను పంపిణీ చేశారు.