చౌడేపల్లి మండలంలో 95 శాతం పెన్షన్ల పంపిణీ

CTR: చౌడేపల్లి మండలంలో శుక్రవారం సాయంత్రం వరకు 95 శాతం పింఛన్లు పంపిణీ చేసినట్లు ఎంపీడీవో లీలా మాధవి తెలిపారు. మండల పరిధిలో 15 సచివాలయం సిబ్బంది ద్వారా పెన్షన్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. మండలానికి నూతనంగా 95 మందికి పింఛన్లు మంజూరు అయినట్లు తెలిపారు. పెన్షన్లు మిగిలిన వారికి త్వరగా అందజేస్తామని ఆమె తెలిపారు.