రోహిణీ దారిలోనే.. మరో ముగ్గురు కూతుళ్లు
బీహార్‌లో ఓటమి తర్వాత RJD అధినేత లాలూ కుటుంబంలో కలహాలు తీవ్రమయ్యాయి. ఇప్పటికే తేజస్వీపై ఆరోపణలు చేస్తూ కుమార్తె రోహిణీ ఇంటి నుంచి బయటకు వెళ్లగా తాజాగా మరో ముగ్గురు కుమార్తెలు కూడా వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. రాజ్యలక్ష్మీ, రాగిణి, చందాలు తమ పిల్లలతో కలిసి లాలూ నివాసం నుంచి ఢిల్లీకి పయనమైనట్లు సమాచారం. తమ సోదరి రోహిణీకి మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నారు.