వెంకట్రావుపల్లిలో పశు వైద్య శిబిరం

NLR: ఉదయగిరి మండలం వెంకట్రావుపల్లెలో శుక్రవారం పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో పాడిపశువులకు, గొర్రెలు, మేకలకు పరీక్షలు నిర్వహించి, నట్టల నివారణకు ఉచితంగా మందులు అందజేశారు. పశువులకు గర్భధారణ పరీక్షలు నిర్వహించి పోషకులకు పలు సూచనలు సలహాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ యస్.వరలక్ష్మి శ్రీరాములు, ఖాదర్ భాషా, ఖాజా మొహిద్దిన్ పాల్గొన్నారు.