చందనోత్సవం విజయానికి విశాఖ పోలీసుల కీలక పాత్ర
VSP: సింహాచలం చందనోత్సవం సందర్భంగా విశాఖపట్నం నగర పోలీసులు చూపిన సేవా దృక్పథం, భద్రతా ఏర్పాట్లు భక్తుల ప్రశంసలు పొందుతున్నాయి. భారీగా తరలివచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా క్యూలైన్లను క్రమబద్ధంగా నిర్వహించారు. వృద్ధులు, మహిళలు, చిన్నారులకు ఎండ తీవ్రత నుంచి రక్షణ కల్పిస్తూ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.