ఆశ్రమ పాఠశాలను సందర్శించిన MPDO

ADB: నార్నూర్ మండలంలోని జాండ ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను సోమవారం ఎంపీడీవో గంగాసింగ్ సందర్శించారు. ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది రికార్డులను పరిశీలించారు. విద్యార్థినులకు ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారమే పిల్లలకు భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో MPO సాయిప్రసాద్, అధికారులు పాల్గొన్నారు.