నిమజ్జనం వేళ విషాద ఘటన

సత్యసాయి: పరిగి మండలంలోని పెద్దిరెడ్డి పల్లి గ్రామంలో వినాయక నిమజ్జనం సందర్భంగా అపశృతి చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి వినాయకుడి విగ్రహల ఊరేగింపు సమయంలో ట్రాక్టర్ అదుపు తప్పి జనాలపై దూసుకెళ్లగా ఒకరు మృతి చెందారు. 15 మంది గాయపడినట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.