పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి: DEO
VZM: జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు DEO మాణిక్యం నాయుడు తెలిపారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో శనివారం మాట్లాడుతూ.. పరీక్షల నిర్వహణకు 119 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 119 మంది డిపార్ట్‌మెంటల్ అధికారులు, 30 మంది అదనపు అధికారులు, 1,210 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లు తెలిపారు.