'రాత్రి 7 నుంచి ఉదయం వరకు ప్రయాణాలు చేయొద్దు'

'రాత్రి 7 నుంచి ఉదయం వరకు ప్రయాణాలు చేయొద్దు'

ASR: మొంథా తుఫాన్ ఎక్కువ ఉన్నందున వాహనదారులు మంగళవారం రాత్రి 7 గంటల నుంచి బుధవారం ఉదయం వరకు అరకులోయ, డుంబ్రిగూడ, అనంతగిరి పరిధిలో వాహనాలతో ప్రయాణించకూడదని సీఐ హిమగిరి తెలిపారు. భారీ వర్షం, గాలి ఎక్కువగా ఉన్నందున ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణాలు చేయొద్దని హెచ్చరించారు. అలాగే తుఫాన్ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లకు తెలపాలన్నారు.