CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
BPT: కొల్లూరు మండలానికి చెందిన వివిధ గ్రామాల లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన రూ. 7,77,404ల ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేశారు. వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు స్వయంగా లబ్ధిదారులకు, వారి కుటుంబ సభ్యులకు చెక్కులను అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సహాయం అందేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.