పురవీధులలో ఊరేగిన శ్రీకాళహస్తీశ్వరుడు

పురవీధులలో ఊరేగిన శ్రీకాళహస్తీశ్వరుడు

TPT: శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో అమావాస్య సందర్భంగా ఆదివారం రాత్రి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుడిని పురవీధులలో ఊరేగించారు. ముందుగా ఆలయ అలంకార మండపంలో వివిధ పుష్పాలతో, ఆభరణాలతో స్వామి, అమ్మవార్లను విశేషంగా అలంకరించారు. ధూప, దీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను పట్టణ పురవీధులలో ఊరేగించారు.