ఇరానీయులకు యూఏఈలోకి నిషేధం!
యూఏఈ యుద్ధంలోకి నేరుగా ప్రవేశించకపోయినా ఇరాన్ ఆ దేశంపై దాడులు తీవ్రతరం చేస్తోంది. ఈ క్రమంలోనే ఇరాన్ ప్రతీకార దాడుల కారణంగా టెహ్రాన్ ప్రజలు తమ దేశంలోకి ప్రవేశించడంపై యూఏఈ నిషేధం విధించినట్లు పలు విమానయాన సంస్థలు వెల్లడించాయి. దేశంలో గోల్డెన్ వీసాలు ఉన్నవారిని ఇందులో నుంచి మినహాయించినట్లు పేర్కొన్నాయి. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.