జిల్లాలోని చిరు వ్యాపారులకు శుభవార్త

W.G: జిల్లాలోని ప్రతి పట్టణంలోనూ చిరు వ్యాపారులకు చేయూతనిచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2020లో పీఎం స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ యోజనను ప్రారంభించారు. మెప్మా ఆధ్వర్యంలో వీరిని గుర్తించి రుణాలు అందించారు. ఇప్పుడు రుణాన్ని తొలి విడతగా రూ. 15 వేలు, రెండో విడతగా రూ. 30 వేలకు పెంచారు. ఉత్తర్వులు వచ్చాక ఈ ప్రక్రియ ప్రారంభవుతుందని నరసాపురం మెప్మా అధికారి రత్నాకర్ తెలిపారు.