విద్యార్థులకు ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం
తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పీర్లచవడిలోని ఎస్వీ హైస్కూల్లో విద్యార్థులకు ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో రోడ్డు భద్రతపై ముఖ్య సూచనలు ఇచ్చారు. ట్రాఫిక్ నిర్వహణ, హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం, జీబ్రా క్రాసింగ్ వినియోగం వంటి అంశాలను విద్యార్థులకు వివరించారు.